పిఠాపురంలో పవన్ కల్యాన్ ఘన విజయం
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అమరావతి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అమరావతి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా తీపై పవన్ కల్యాణ్ 50వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
జనసేనాని పవన్ ఈసారి ఎలాగైనా జగన్‌ను ఓడిస్తానని శపథం చేశారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్‌ను ఓడించటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. జనసేన 21 ఎమ్మెల్యే, 2ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజా ట్రెండ్స్ మేరకు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపు దిశగా వెళ్తోంది. 100శాతం స్ట్రైకింగ్ రేట్‌తో పవన్ విజయం సాధించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రికార్డు అని చెప్పాలి.
రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కానుంది. పవన్‌కు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ రాజకీయం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా పవన్ ఇప్పుడు రాష్ట్రంలో పాలనలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.



