ఉత్కంఠగా ఏపీ ఎన్నికల కౌంటింగ్.. ప్రముఖుల ముందజ

ఉత్కంఠగా ఏపీ ఎన్నికల కౌంటింగ్.. ప్రముఖుల ముందజ

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అన్ని జిల్లాల్లో 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటుచేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ క్రమంలో పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పోటీలో ఉన్న పవన్ కల్యాన్ 1000 ఓట్ల మెజార్టీతో ముందజలో ఉన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పలో 1549ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  సీఎం జగన్ పులివెందులలో లీడింగ్‌లో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉన్నారు.

హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బాలకృష్ణ మొదటి రౌండ్‌లో  1880ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ లీడ్‌లో ఉన్నారు. కాగా, నగరి నుంచి పోటీ చేస్తున్న రోజా వెనుకంజలో ఉన్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఈ స్థానంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనుకబడ్డారు. 

Related Posts