చేనేత కార్మికులంతా సంఘటితం కావాలి. -రాపోలు వీరమోహన్
విశ్వంభర, చండూర్:- చేనేత సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టిన తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ గురువారం నాడు చండూరు మున్సిపాలిటీలో పర్యటించి, చేనేత కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన చేనేత కార్మికుల సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చేనేత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు.వారు చండూరుకు విచ్చేసిన సందర్భంగా.. చండూరు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ఆ దిశగా స్థానిక ఎమ్మెల్యేలు 29 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి చేనేత కార్మికులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.చండూరు చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు రాపోలు వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇట్టి సమావేశంలో... చెరుకు మల్లయ్య, చెరుకు విజయ్, జెల్ల రఘు, చండూరు పట్టణ పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు పులిపాటి ప్రసన్న , ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు, ఉభయ దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, ఏలె మహేష్,జూలూరు వెంకటేశం,బొల్ల జనార్ధన్, వర్కాల విజయ్, కర్నాటి శ్రీను,గుర్రం రాము,రుద్ర శేఖర్, పద్మ పవన్, చెరుపెల్లి నరేష్, గంజి వెంకటేశం, రాపోలు సత్తయ్య, గుర్రం విష్ణుమూర్తి,చెరిపెల్లి సుదర్శన్, గంజి బావనా రుషి, కర్నాటి రవి, చెరిపెల్లి రాఘవేంద్ర, గంజి బిక్షం, చెరిపెల్లి మల్లేష్, చెరిపెల్లి రాజు, గజం రాజు, చిలుకూరి సతీష్, దుడుకు సత్యనారాయణ, పున్న వేణు, రావిరాల బిక్షం, తిరందాసు బిక్షమయ్య రుద్ర మార్కండేయ, పున్న ఆరుణోదయ, కోడి శివ ఇంకా చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



