ఘనంగా శతచండీ యాగ మహోత్సవం

ఘనంగా శతచండీ యాగ మహోత్సవం

విశ్వంభర, హనుమకొండ:- ఘనంగా శత చండి యాగ మహోత్సవం హనుమకొండలోని రాంనగర్, వెంకట్రామ్ నగర్ లో ఉన్న  శ్రీ మాతభువనేశ్వరి మాత దేవాలయంలో ,శనివారం ప్రారంభ  మూడు రోజులపాటు  సోమవారం వరకు ఘనంగా నిర్వహించామని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ భువనేశ్వరి మాత దేవాలయం చైర్మన్ మోత్కూరి రామేశ్వరరావు మయూరి లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రయాహ్నిక దీక్షతో
శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పేరాదీశ్వరులు, పరమహంస పరివ్రాజకులు జగద్గురుశ్రీశ్రీశ్రీమదభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామివారి ఆశీస్సులతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు.గోపూజతో ప్రారంభం అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనము, మాతృక, నానీ, పంచగవ్యప్రాశనము, ఋత్విక్వరుణ, చండీ పారాయణములు, 
మండపపూజ, చండీ పారాయణములు, శతరుద్రాభిషేకము, అరుణ హోమము మండపపూజ, 8:00 గం॥లకు శతచండీ, పంచసూక్త హోమములు  శ్రీశ్రీశ్రీమదభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాపూర్ణాహుతి, కళశోద్వాసన, తీర్థప్రసాద వితరణ అనంతరం ఋత్విక్ సన్మానము. ఈ యాగంలో త్రీ నగర పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని  అన్నప్రసాద వితరణ  తీర్ధప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ  కార్యక్రమంలో
మోత్కూరి లలితాదేవి- గంగాధర్ రావు
కాచరాజు పద్మావతి - సిద్ధేశ్వర్ రావు
వేముగంటి పద్మజ - సీతారామారావు
ట్రస్టు సభ్యులు గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Tags: