చిత్రినాక మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో 58వ గణేష్ వార్షికోత్సవాలు

చిత్రినాక మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో 58వ గణేష్ వార్షికోత్సవాలు

విశ్వంభర/ చత్రినాక:-  మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో 58వ గణేష్ నవరాత్రి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం గణపతి పూజ, మహా హారతి అనంతరం భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ఎస్పి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరుగుతున్న 58వ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా గణపతి హోమం పలుమార్లు అన్నదాన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఐ ఆదిత్య, బి కోటేష్, బి నితిన్ చారి, ఐ రాహుల్, ఎస్ కిరణ్ కుమార్, బి వెంకటేష్,సంతోష్, సి సుధాకర్,కే సరోజ్, బి నితిన్ చారి, ఆదిత్య పాల్గొని కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు

Tags: