టేకు దుoగతో గణపతి విగ్రహం చెక్కిన సున్నం బ్రహ్మయ్య - ఆకర్షిస్తున్న కర్ర గణపతిని చూడడానికి బారులు తీరిన ప్రజలు
On
విశ్వంభర, మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో గల మనసు వుడ్ ఫర్నిచర్ వర్క్స్ ప్రోపరేటర్ సున్నం బ్రహ్మయ్య అనే వడ్రంగి ఒకే ఒక టేకు దుoగతో ఎలాంటి అతుకులు జాయింట్స్ లేకుండా సహజ సిద్ధంగా ప్రతిమను తయారుచేసి వినాయక నవరాత్రులలో భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సున్నం బ్రహ్మయ్య మాట్లాడుతూ మహారాష్ట్రలో గల కర్ర గణపతి (పాలాజీ గణపతి)ని చూసి 14 సంవత్సరాల క్రితం టేకు కర్రతో గణపతిని తయారు చేశానని, ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులలో పూజలు నిర్వహిస్తామని మెట్ పల్లి గ్రామ ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి భక్తులు వస్తారని చెప్పారు. నవరాత్రుల అనంతరం ప్రత్యేక గదిలో భద్ర పరుస్తామని చెప్పారు