ఈదురు గాలులతో భారీ ఆస్తి నష్టం
విశ్వంభర, చింతపల్లి: మండలంలోని నసర్లపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి వచ్చిన భారీ ఈదురు గాలులతో రోడ్డు వైపు ఉన్న చెట్లు నేలకొరిగాయి. అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రామక్రిష్ణ రైస్ ఇండస్ట్రీస్ కప్పుపై ఉన్న రేకులు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. దాంతో సమీపంలో ఉన్న రైతులు భయభ్రాంతులకు గురైనారు. ఈదురు గాలులతో రైస్ మిల్లు రేకులు ఎగిరి పోవడంతో సుమారు 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. భారీ గాలులతో చెట్లు నేలమట్టం కావడంతో ప్రజలు కొంత ఇబ్బందులకు గురైనారు.