చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఒక ఆటో సీజ్
సీసీ కెమెరాలు ఆధారంగా దొంగ గుర్తింపు
సూర్యాపేట టౌన్ సిఐ వెంకట్
విశ్వంభర, సూర్యాపేట: ఈ నెల 27వ తేదీన సూర్యాపేట టౌన్ ఖమ్మం అండర్ పాస్ వద్ద చివ్వెంల వెళ్లడానికి వాహనాల కోసం ఎదురుచూస్తున్న చివ్వేంల మండల కేంద్రానికి చెందిన 65 సంవత్సరాల మహిళ ధనలక్ష్మి ని ఆటోలో ఎక్కించుకుని ఖమ్మం రోడ్డు లో గల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి 18 గ్రాముల బంగారు పుస్తెలతాడును ఆటో డ్రైవర్ దొంగిలించాడు. దీనిపై ఆ మహిళా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దొంగను అరెస్ట్ చేసి 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఆటోని సీజ్ చేశామని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో ను గుర్తించి ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన 22 సంవత్సరాల భూతం మహేష్ గా గుర్తించారు. భూతం మహేష్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ సూర్యాపేట పట్టణ కేంద్రంలో శ్రీనివాస నగర్ లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. నిందితుడు మహేష్ కు తిరుపతమ్మ అనే మహిళతో సంబంధం ఉన్నది తిరుపతమ్మ కు డబ్బులు అవసరం ఉండగా ఎలాగైనా తిరుపతమ్మకు డబ్బు ఇవ్వాలని అనుకున్నారు. దొంగతనానికి పాల్పడిన 27 న తనకు పరిచయం ఉన్న తిరుమతమ్మ ను మరిపెడ బంగ్లాలో దింపడానికి ఆటో ఎక్కించుకుని ఖమ్మం రోడ్లు వెళుతుండగా అక్కడ చివ్వెంల వెళ్లే వాహనాల కోసం ఎదురుచూస్తున్న ధనలక్ష్మి ఆటోను ఆపినది ధనలక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడుని గమనించి మహేష్ తిరుపతమ్మ ఇద్దరు మాట్లాడుకుని ఎలాగైనా దొంగతనం చేయాలని ఆమెని ఆటోలో ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్ళాక నిర్మాణస్య ప్రాంతానికి తీసుకువెళ్లారు, ఇటు ఎందుకు తీసుకెళుతుంది అని ధనలక్ష్మి అడగగా పోలీసు వారు తనిఖీలు చేస్తున్నారు ఫైన్స్ రాస్తారు కావున ఇటు వెళుతున్నాము అని ఆమెకు నమ్మబలికి కొద్ది దూరం వెళ్ళాక ఆమెను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న 18 గ్రాముల పుస్తెలతాడును దొంగతనం చేసి ఆమెను అక్కడే వదిలేసి పరాయి వయ్యారు. అనంతరం నిందితుడు బంగారాన్ని తను కిరాయి కుంటున్న ఇంట్లో పెట్టుకున్నాడు. నమ్మదగిన సమాచారంపై ఈరోజు 12 గంటల సమయంలో శ్రీనివాస నగర్ లో మహేష్ కిరాయికి ఉంటున్న ఇంట్లో ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో పోలీసు బృందం అదుపులోకి తీసుకోవడం జరిగినది. 18 గ్రాముల బంగారం ఒక ఆటో సీజ్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది. కేసు దర్యాప్తులో బాగా పనిచేసిన ఎస్ఐ వెంకన్న, సిబ్బంది శ్రీరాములు శ్రీరాములు, రామనర్శయ్య, టెక్నికల్ టీం సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది.