ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రటిష్టంగా ఉండాలి
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం రేగడి తండా గ్రామపంచాయతీ శివారు చీమల తండా ఎం.పీ.పీ.ఎస్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు జరిగాయి . ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ హరిలాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుడిబోయిన మాధవరావులు మాట్లాడుతూ, విద్యార్థులకు, ప్రీ,ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా పటిష్టంగా ఉండాలని విద్యార్థుల భవిష్యత్తు ఆశయాలు రూపుదిద్దుకునే సమయమని ఈ ప్రైమరీ స్థాయిలోనే విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపిస్తే భవిష్యత్తు తరాలకు మేధాశక్తి గల విద్యార్థులు అందించవచ్చని , అంతేకాకుండా కార్యక్రమం ద్వారా విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని పొందారని గ్రాడ్యుయేషన్ నిర్వాణ చేయడం చాలా ఆనందంగా ఉంది అని గుర్తు చేశారు . ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రధానోపాధ్యాయుల్ని , పాఠశాల అధ్యాపక బృందాన్ని స్థానిక సర్పంచ్ అభినందించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శివకుమారి , గ్రామ కార్యదర్శి రవి , విద్యార్థిని , విద్యార్థులు , విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు



