కేసులకు అరెస్ట్ లకు భయపడేది లేదు. - డా. కాచం
ఉద్యమకారుల ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం: కాచం
ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తే మరో ఉద్యమం తప్పదు
విశ్వంభర, ఎల్బీనగర్/ చైతన్యపురి :తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన ( టి ఆర్ ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఉద్యమకారులకు పోరాటం భూ పోరాటం పిలుపుమేరకు కాచం సత్యనారాయణ ను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏ పార్టీకి కొమ్ముకాయధని, ఉద్యమకారుల భూపోరాటం చేస్తున్నందున మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలము, గుర్తింపు కార్డు లాంటి హామీలు ఇచ్చిందని ఆ వాగ్దానాల అమలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేశవరావు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. అర్హులైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు తగిన గౌరవం కల్పిస్తూ, ఆగస్టు 6లోపు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం చేయడంతో పాటు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కాచం సత్యనారాయణ స్పష్టం చేశారు.