వైద్యులను సత్కరించిన విద్యార్ధులు   

వైద్యులను సత్కరించిన విద్యార్ధులు   

విశ్వంభర, రామన్నపేట: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో సేవలందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లుతో పాటు డా.మాధవాచారి, డా.అహ్మద్ అలీ, డా.ఆదిల్, డా.శ్వేత ప్రియాంక, డా.నవీన్, డా.ఉదయ్ లను నర్సింగ్ సిబ్బందిని మండల కేంద్రంలోని వివేకానంద డివైన్ మోడల్ స్కూల్ వ్యవస్థాపకులు టి.మల్లికార్జున్, హెడ్‌మాస్టర్ వి.మల్లేష్, ఉపాధ్యాయులు కె.నాగరాజు, కె.సాయి, విద్యార్థిని, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యుల సేవలు అమోఘం అని, సమాజంలో వైద్యులు నిజమైన దేవుళ్లు అని, వారి త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని కొనియాడారు. విద్యార్థినీ విద్యార్థులు వైద్యులకి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైద్యులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆసుపత్రి వైద్యులు, నర్సులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/students-honored-doctors/article-17606

Tags: