గ్రాడ్యుటీ ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి
అనంతపురం, విశ్వంభర: అనంతపురం మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పనిచేసి రిటైర్ అయిన పారిశుద్ధ కార్మికులకు, అలాగే సర్వీస్‌లో ఉన్న సమయంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల నామినీలకు పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్–1972 ప్రకారం రావలసిన గ్రాడ్యుటీ ఇప్పటికీ అందకపోవడం చాలా బాధాకరమని ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అజయ్ బాబు తెలిపారు. గ్రాడ్యుటీ చట్టం 1972లోనే అమల్లోకి వచ్చినప్పటికీ అనంతపురం మున్సిపాలిటీలో ఇప్పటికీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం కార్మికుల నిరక్షరాస్యతతో చెలగాటం ఆడినట్లుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 మంది కార్మికులకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అజయ్ బాబు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె.ఆర్. సురేష్, ట్రెజరర్ ఓబులేసు, వెంకట నరసయ్య, శశిభూషణ్, లక్ష్మణ్, ఈశ్వరయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.



