ఆర్టీసి డిపోల అభివృద్ధిలో కార్మికులదే కీలక పాత్ర
- యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్‌ను గెలిపించాలి
- ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ సెక్రెటరీ కొమురయ్య
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన డిపో కమిటీని డిపో మేనేజర్‌కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ సెక్రటరీ కె. కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ డిపో అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఉద్యోగులకు యాజమాన్యం సహకారం అందిస్తే డిపో మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాబోయే యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్‌ను గెలిపించాలని కోరారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో ఎంప్లాయిస్ యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని, 2021 పే స్కేల్ ఏరియర్స్ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అధ్యక్షుడిగా సంజీవ్ చారి, కార్యదర్శిగా రాజు, చైర్మన్‌గా వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుమారస్వామి, కోశాధికారిగా శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలిగా వనజ, మహిళా కార్యదర్శిగా సరిత, రీజినల్ సభ్యులుగా రాజయ్య, శ్రీశైలం, వనితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.