పెద్ది సేవలు చిరస్మరణీయం

పెద్ది సేవలు చిరస్మరణీయం

  • సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళి

విశ్వంభర, హుస్నాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించి, ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, మాలోతు బీలు‌నాయక్, పెండెల అయిలయ్య, చిత్తారి శ్రీనివాస్, యాస శ్రీనివాస్, అయిలేని గాల్ రెడ్డి, పాక శ్రీనివాస్, ఇరుగు రమేష్, మార్క శ్రీనివాస్, సత్యం నాయక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/peddis-services-are-memorable/article-20604

Tags: