డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు .. చదువుల్లో బాగా రాణించాలి
విశ్వంభర, నెల్లికుదురు: గంజాయి,డ్రగ్స్, మాదకద్రవ్యాలకు కు దూరంగా ఉంటూ చదువుల్లో బాగా రాణించాలని ప్రిన్సిపాల్ కె. వీరస్వామి కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, యువతకు సూచించారు. మండల కేంద్రం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 1-2 యూనిట్ ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సమావేశానికి ప్రిన్సిపాల్ హాజరై మాట్లాడుతూ మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.విద్య, ఆరోగ్యం, మంచి విలువలతో కూడిన జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను ఆస్వాదిస్తూ సమాజ సేవా కార్యక్రమాలను అలవర్చుకుంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చదువులో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఉద్బోధించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి" అనే సందేశాన్ని సమాజానికి చేరవేశారు. అనంతరం వాలంటీర్ల చే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ భరత్,యాకయ్య,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు,కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, ప్రకాష్ బాబు,కవిరాజు,మహేందర్, యాకన్న,సుభాష్, విద్యార్థులు పాల్గొన్నారు.