ఫీజు బకాయిలతో  విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

విశ్వంభర, భువనగిరి : విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ భువనగిరిలో  విద్యార్థులు శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జీవో నెం.9, ఆర్‌ఆర్ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని, విదేశీ స్కాలర్‌షిప్‌లను అర్హులందరికీ అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/future-of-students-in-question-with-fee-arrears/article-20614

Tags: