కమాండెంట్ కిషన్ రావుకు ఘనంగా వీడ్కోలు
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు సిటీ ఆర్మీ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ కమాండెంట్ ఎన్వీ కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. నూతన కమాండెంట్ కిష్టయ్య ఆధ్వర్యంలో సాయుధ దళాల గౌరవ వందనంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ వ్యవస్థ అభివృద్ధికి కిషన్ రావు అందించిన సేవలను అధికారులు, సిబ్బంది కొనియాడారు. హైదరాబాదు సిటీ హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్, ఆర్‌ఐలు అశోక్, నరసింహ గౌడ్, ఆర్‌ఎస్‌ఐలు ప్రవీణ్, సైదులు, పండరి, స్వప్నలత, ఏఆర్‌ఎస్‌ఐ రామచంద్ర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ హోమ్ గార్డ్ ఏడుకొండలు, రాజేష్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.