ఇబ్రహీంపట్నంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు నూతన కమిటీల ఎన్నిక

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీయూడబ్ల్యూజే (హెచ్-143), తెంజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీల ఎన్నిక శుక్రవారం బృందావన్ కాలనీలో ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్-143) నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, తెంజు అధ్యక్షుడు వరికుప్పల అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, గృహ నిర్మాణం తదితర హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) అధ్యక్షుడిగా సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మొలుగు శ్రీనివాస్ ఎన్నిక కాగా, తెంజు అధ్యక్షుడిగా వరికుప్పల అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆముదల సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/election-of-new-committees-of-tuj-h-143-tenju-in-ibrahimpatnam/article-20616

Tags: