ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ ప్రారంభించిన తలసాని శ్రీనివాస్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం, ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.