విపత్తుల నివారణ పై అధికారుల సమావేశం

విపత్తుల నివారణ పై అధికారుల సమావేశం

విశ్వంభర, నెల్లికుదురు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సింగారపు కుమార్ అధ్యక్షతన శుక్రవారం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎలా నివారించాలో అధికారులతో ముందస్తు సమావేశం జరిగింది. దీనికి స్పెషలాఫీసర్ మరియన్న,తహసిల్దార్ చంద నరేష్, మండల వైద్యాధికారి డా.రమ్య తో పాటు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు విపత్తుల రకాలు, సహాయక చర్యల నిర్వహణ దశలు,మానవ కారకాల వలన సంభవించే ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేయడం, వాటి ప్రభావాన్ని తగ్గించడం,ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించడం, ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టాలో చర్చించారు. ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అంచనా వేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్, ఇరిగేషన్ ఏఈ ప్రణయ్, ఏపీవో నరేందర్, ఐసిడిఎస్ సూపర్వైజర్, పోలీస్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-meeting-of-authorities-on-disaster-prevention/article-20578

Tags: