తన భూమిని ఆక్రమిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన

విశ్వంభర, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ ఆరేపల్లి పరిధిలోని సర్వే నంబర్ 707లో తనకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగి బుద్దె సుదర్శన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమ తండ్రి బుద్దె సదానందం కుటుంబ సభ్యుల మధ్య భూమిని విభజించారని, అందులో తనకు 37 గుంటలు, సోదరుడికి 29 గుంటలు, మరో సోదరుడికి 23 గుంటలు కేటాయించారని తెలిపారు. అయితే తన సోదరుడు బుద్దె సదానందం తన పదవిని ప్రభావంగా ఉపయోగించుకుని తన భూమిపై హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తన భూమిలో నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించగా, వాటిని ధ్వంసం చేసి తీసుకెళ్లారని, దీనివల్ల సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని, మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని సుదర్శన్ విజ్ఞప్తి చేశారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/retired-employee-complains-that-his-land-is-being-encroached-upon/article-20556

Tags: