బైక్ చోరీ ముఠా అరెస్టు
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల పోలీస్ డివిజన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, బైక్ చోరీలపై పోలీసులు సంచలన విజయం సాధించారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది, క్రైమ్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో ఒక అంతర్రాష్ట్ర ఇంటి దొంగతో పాటు బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.6.5 లక్షల విలువైన ఆస్తితో పాటు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ముకేశ్ చౌదరి ప్రస్తుతం హైదరాబాద్‌లో జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతను ఆదిబట్ల, హయత్‌నగర్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఏడు ఇంటి దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుంచి మూడు తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్, గ్లామర్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సయ్యద్ ఖాసిం హుస్సేన్, మహ్మద్ కరీంను అరెస్టు చేసి, పరారీలో ఉన్న షేక్ సల్మాన్ కోసం గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద నుంచి ఆదిబట్ల, చందానగర్, ఘట్‌కేసర్, చౌటుప్పల్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన ఐదు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. ఈ కేసుల వివరాలను ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, సీఐ రమేష్, డీఎస్‌ఐ నోయెల్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.