ప్రభుత్వ కార్యాలయాల పక్కనే చెత్త కుప్పలు.. స్థానికుల్లో ఆందోళన

* మహేశ్వరం మండల కేంద్రంలో శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

*  వర్షాకాలంలో అంటువ్యాధుల భయంతో స్థానికుల ఆందోళన

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో రోడ్డు పక్కనే  చెత్త వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.కేబీ తండా నుంచి మహేశ్వరం వచ్చే ప్రధాన రహదారిపై మండల ప్రజా పరిషత్ కార్యాలయం, కోర్టు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమీపంలో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వందలాది మంది ప్రజలు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికిగురవుతున్నట్లు చెబుతున్నారు. కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రత లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు,రోడ్డు పక్కనే చెత్తను బహిరంగంగా వేయడం వల్ల సమీపంలో నివసించే కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మహేశ్వరం మండల కేంద్రానికి శాశ్వత డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి, రోడ్ల పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/garbage-heaps-near-government-offices-are-a-concern-among-locals/article-20568

Tags: