ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న క్షేత్ర సందర్శన 

విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న మరిపెడ, దంతాలపల్లి, నెల్లికుదురు మండలాల లో పర్యటించి ఎల్నినో పరిస్థితుల్లో రైతులు ఆరుతడి, కూరగాయ పంటలు, ఆయిల్ పామ్ తోటలు, పండ్ల తోటలు, ఉల్లి, మల్బరీ, మునగ, పంట కుంటలు ( నీటి కుంటలు) ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఎల్ నినో పరిస్థితుల్లో తక్కువ నీటి తో పండే పంటలు సాగు చేయాలని, రైతులు నీటి కుంటలు, మునగ వంటి వాటిని  వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్ గార్ అజివికా మిషన్ గ్రామీణ్ పథకం ద్వారా రాయితీ పొందాలని తెలిపినారు. రైతుల కు కూరగాయ పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, సేంద్రియ వ్యవసాయం, నేచురల్ ఫామింగ్, ఆయిల్ పామ్ సాగు పై అవగాహన చేసినారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ నుండి రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  రైతులు, క్షేత్ర సహాయ అధికారులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/horticulture-department-officer-jinugu-marianna-field-visit/article-20566

Tags: