షాబాద్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్

విశ్వంభర, షాబాద్: మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్  ప్రక్రియను రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బీఎల్‌ఏలతో సమావేశమై ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, దొంగ ఓట్లను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 75–80 శాతం పూర్తైందని, మిగిలిన మూడు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించిన ఆయన, విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని రోహింగ్యా ఓటర్ల అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి మానయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-district-president-raj-bhupal-goud-inspected-the-sir-process/article-20544

Tags: