పెద్ది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
- హుస్నాబాద్ మాజీఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
విశ్వంభర, హుస్నాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజానాయకుడని, ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మరణం ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, ఉద్యమ పట్ల అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని వొడితల సతీష్ కుమార్ పేర్కొన్నారు.