మహేశ్వరం మండలం అభివృద్ధి అంశాలపై సమగ్ర సమీక్ష
- * రోడ్లు, తాగునీరు, డ్రైనేజీపై చర్చ
- * సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలంలోని గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ ఎన్, శుభాషిణి అధ్యక్షత వహించారు,మండలంలోని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ల దుస్థితి, తాగునీటి సమస్యలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ, రెవెన్యూ సమస్యలు, మొక్కల పెంపకం, విద్యా వ్యవస్థ, మద్యపాన నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపడుతున్న పనులు, ప్రగతి, పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు,సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎన్. శారదమ్మ, డీఎల్‌పీఓ సామీ రెడ్డి, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ సభావత్ కృష్ణ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.