ప్రత్యామ్నాయ పంటల పై రైతులకు అవగాహన సదస్సు
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో పులిగిల్ల రైతు వేదికలో ప్రస్తుత ఎల్ నినో వాతావరణ పరిణామాలు వ్యవసాయ రంగ ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలినినో వాతావరణ ప్రభావంతో జూలై నెల నాటికి గత సంవత్సరంతో పోల్చితే తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని నేటికి లోటు వర్షపాతం ఉన్నందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకుమండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి అవగాహన కల్పించారు. ఎలినినో ప్రభావం ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో తీవ్రంగా ఉంటుందని అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం మరియు వర్షాలు కూడా పడే అవకాశం లేదని వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున వరి వేసే రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలని సూచించడం జరిగింది ఒక ఎకరా వరి పండించే నీటితో ఆరుతడి పంటలు 5- 6 ఎకరాలు పండించవచ్చని రైతులకు చెప్పారు.నీటి లభ్యత తక్కువ కారణంగా రైతులు వరి వేసి భవిష్యత్తులో నష్టపోవద్దని కందులు,పెసర్లు,నువ్వులు,ఉలవలు,మినుములు, కూరగాయలు,ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపి అధిక లాభాలు పొందాలని అలాగే సేంద్రియ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పంటలను సాగు చేయాలని అవగాహన కల్పించారు.ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేముల అనుషా,సహకార సంఘం డైరెక్టర్ జక్కా దామోదర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి క్రాంతి కుమార్, పంచాయతీ కార్యదర్శి సైదులు ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్, రైతులు సత్తిరెడ్డి,పుల్లారెడ్డి, సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.