ఆగస్టులో డీమార్ట్‌కు ఏ రోజు వెళ్తే బెస్ట్? షాపర్లకు ఉపయోగపడే ట్రిక్

ఆగస్టులో డీమార్ట్‌కు ఏ రోజు వెళ్తే బెస్ట్? షాపర్లకు ఉపయోగపడే ట్రిక్

డీమార్ట్‌లో షాపింగ్‌కు సోమవారం నుంచి గురువారం వరకు వెళ్లడం మంచిది.

DMart Shopping Tips: డీమార్ట్‌లో తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని భావించే వారికి సరైన సమయం ఎంపిక కూడా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో నెల ప్రారంభంలో కంటే నెల మధ్య లేదా చివరి వారంలో వెళ్లడం వల్ల కొన్ని ఉత్పత్తులపై మెరుగైన ఆఫర్లు, స్టాక్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని షాపింగ్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారాంతాల్లో (శని, ఆదివారాలు) డీమార్ట్ స్టోర్లలో భారీ రద్దీ ఉండటంతో, సోమవారం నుంచి గురువారం మధ్యలో షాపింగ్ చేయడం మరింత సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజుల్లో బిల్లింగ్‌కు తక్కువ సమయం పడటంతో పాటు, ప్రశాంతంగా కొనుగోళ్లు చేసే అవకాశం ఉంటుంది. పండుగల ముందు ప్రత్యేక ఆఫర్లు, కాంబో డీల్స్, ఎంపిక చేసిన ఉత్పత్తులపై తగ్గింపులు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి, స్టోర్‌ను బట్టి మారే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు సంబంధిత డీమార్ట్ స్టోర్‌లో వివరాలు తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: