సమస్యలు ఫిర్యాదు పెట్టెలో నమోదు చేయండి
- ప్రత్యేక అధికారి సాయి శ్రీజ
విశ్వంభర, నెల్లికుదురు: సమస్య తలెత్తి పాఠశాల స్థాయిలో పరిష్కారం కానీ పక్షంలో ఫిర్యాదు పెట్టెలో నిర్భయంగా నమోదు చేయాలని ప్రత్యేక అధికారి సాయి శ్రీజ విద్యార్థులకు సూచించారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ ను శుక్రవారం సాయి శ్రీజ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె స్టాక్ రిజిస్టర్లు, సైన్స్ ల్యాబ్ రికార్డులు, పీటీఎం రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం రిజిస్టర్ తదితర పాఠశాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.విద్యార్థులను మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ పై బాలబాలికలకు అవగాహన కల్పించారు.పాఠశాలలో రికార్డుల నిర్వహణ, విద్యార్థులతో ఉపాధ్యాయుల అనుసంధానం, విద్యా వాతావరణంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.