ఫ్రైడే డ్రై కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ గూడూరు మండలంలోని అయోధ్య పురంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమమును తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, లార్వాలను తొలగిస్తూ, ఇంటి పరిసరాల్లో గల కూలర్ లలో నీరు, కొబ్బరి చిప్పలు, రోళ్ళు, నీటి తొట్టిలు, నీరు నిల్వ ప్రాంతాలలో దోమలు పుట్టకుండా లార్వాలను తొలగించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, దోమలు కుట్టకుండా ఇంటి ద్వారలకు, కిటికీలకు, మెష్ డోర్లను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా జిల్లాలో గల సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు,ఆశలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, సూపర్వైజర్, ఆశాలు పాల్గొన్నారు.