పంట మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
విశ్వంభర, మహబూబాబాద్ : శుక్రవారం కొత్తగూడెం మండలంలో పంట మార్పిడి విధానం కార్యక్రమంలో భాగంగా రైతు బానోతు బిచ్చ, బానోతు సుమన్ పొలంలో ప్రాజెక్టు వైవిధ్యం కింద జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. .అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ పరిశీలించి లబ్ధిదారులు బంగారి సాంబలక్ష్మి, గట్టి సుగుణ లతో మాట్లాడి గృహాలను వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. గాంధీనగర్ లోని గిరిజన బాలికల గురుకులమును పరిశీలించి విద్యార్థిని, విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నారు.