నందిగామ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నాకాబందీ   

  • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు

విశ్వంభర, షాద్ నగర్ : ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నందిగామ ప్రధాన రహదారిలో ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు.ఈ తనిఖీల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నాకాబందీ సందర్భంగా మొత్తం 80 వాహనాలను తనిఖీ చేశారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్‌లో ఉన్న 53 ఈ-చలాన్లను క్లియర్ చేయించి రూ.23,770 జరిమానా వసూలు చేశారు.అదనంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు 8 మందికి స్పాట్ చలాన్లు జారీ చేసి రూ.1,100 జరిమానా విధించారు. అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.ఈ నాకాబందీ కార్యక్రమంలో నందిగామ పోలీస్ స్టేషన్ బి.వీరబాబు ఆధ్వర్యంలో నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని తనిఖీలు నిర్వహించారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nakabandi-under-nandigama-police-station/article-20546

Tags: