పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివాళి

విశ్వంభర, ముషీరాబాదు : దివంగత నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ముషీరాబాదు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాదు ముషీరాబాదు డివిజన్‌లోని ముషీరాబాద్ చౌరస్తాలో శుక్రవారం సీనియర్ నాయకుడు టి. సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా ఉద్యమాలకు అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో బోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, శివ ముదిరాజ్, మీడియా ఇన్‌చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, బల్ల ప్రశాంత్, సదా, మోహిన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-mutha-gopals-tribute-to-peddi-sudarshan-reddy/article-20552

Tags: