విప్లవ ఐక్య ఉద్యమాలు నిర్మించాలి: మల్లేపల్లి ప్రభాకర్

విశ్వంభర, హైదరాబాదు : కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్మిక-రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా విప్లవ, ప్రజాస్వామ్య శక్తులు ఐక్య ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ(ఎమ్‌ఎల్) రామచంద్రన్ పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాదులో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవి అమల్లోకి వస్తే కార్మికుల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, కార్మిక సంఘాల హక్కులు దెబ్బతింటాయని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు. అంగన్‌వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్, ఔట్‌సోర్సింగ్ రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజా హక్కుల పరిరక్షణ కోసం విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మల్లేపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. సమావేశానికి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్లుట్ల ఉపేందర్ అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mallepally-prabhakar-should-build-revolutionary-united-movements/article-20554

Tags: