ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం
విశ్వంభర, పరిగి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో పరిగి మండల ప్రవాస్ అభియాన్ సందర్భంగా పరిగి మండలంలోని లక్నాపూర్, మిట్ట కోడూర్ గ్రామాల్లో బీజేపీ పరిగి మండల అధ్యక్షురాలు అనసూయ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో పరిగి మండల ప్రభారి రామచంద్రయ్య బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ ఓటరు జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు, మార్పులు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ కన్వీనర్ ఉగ్ర నరసింహ,బీజేపీ సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్ , వెంకటయ్య , మల్లేష్ , రవికుమార్, శ్యాంసుందర్ గారు, బీజేపీ యువ నాయకులు మనోహర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.