ఎన్సిసి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచిన రామన్నపేట విద్యార్ధి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వడ్లకొండ చందు ఎన్సిసి సి పరీక్షలో ఏ గ్రేడ్ సాధించిన సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అభినందించారు. 31 తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్సిసి సి పరీక్షలో వడ్లకొండ చందు ఏ గ్రేడ్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ, ఎన్సిసి మంచి క్రమశిక్షణను పెంపొందింప జేయడమే కాకుండా మంచి ఉపాధిని కలిగిస్తుందని, అందువల్ల విద్యార్థులు ఎన్సిసిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.