బోనాలకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
విశ్వంభర, హైదరాబాదు : లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాదునగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబుదొంగతనాల నివారణకు క్రైమ్ విభాగం, షీ టీమ్స్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఉత్సవాల విజయానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో: అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ ఈ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.