ఇంటర్మీడియట్ విద్యా మండలి పాఠ్యపుస్తక రచయితగా సేవలందించిన రామన్నపేట ప్రొఫెసర్
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డా.జోగు చిన్నబాబు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తక రచయితగా సేవలందించిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, డా.చిన్నబాబు కళాశాలలో అకాడమిక్ కో-ఆర్డినేటర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల సిలబస్ రూపకల్పన కమిటీలలో సభ్యునిగా విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సబ్జెక్ట్ కమిటీ సభ్యునిగా ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తక రచనలో కీలక పాత్ర పోషించడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే గతంలో తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో డిగ్రీ స్థాయి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రచనలోనూ డా.చిన్నబాబు విశేష కృషి చేశారని కొనియాడారు. అధ్యాపక వృత్తిలో పరిపాలనా బాధ్యతలతో పాటు అకడమిక్ రంగంలో మరిన్ని నాణ్యమైన పుస్తకాలను రచించి విద్యారంగానికి సేవలందించారని తెలియజేశారు. డా.జోగు చిన్నబాబు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధతో కృషి చేసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.