తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం ఉపాధ్యక్షులుగా వెంపటి శబరినాథ్
విశ్వంభర, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం ఉపాధ్యక్షులుగా వెంపటి శబరినాథ్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. సూర్యాపేటకు చెందిన వెంపటి శబరినాథ్ 2018 సంవత్సరం నుండి వాసవి క్లబ్బులో వివిధ హోదాల్లో సేవలందించారు. ఇటీవల జరిగిన ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఎన్నికల్లో సైతం తన వంతుగా సేవలు అందించడంతోపాటు ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వ సేకరణలో ముందుండి తనదైన శైలిలో అత్యధికంగా సభ్యత్వాలు సేకరించి రాష్ట్ర మహాసభ దృష్టిని ఆకర్షించారు. వీరు చేస్తున్న సేవలకు గాను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ లో స్థానం సంపాదించడం పట్ల పలువురు ఆర్యవైశ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.