ఆగస్టు 2న తెలుగు వెలుగు సమాఖ్య సాహిత్య కార్యక్రమం
విశ్వంభర, హైదరాబాద్: యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, చౌడూరి కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని ఆగస్టు 2న హైదరాబాద్‌లోని కోఠి సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించనున్నట్లు చౌడూరి కళాపీఠం వ్యవస్థాపకుడు చౌడూరి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డికి ప్రతిష్ఠాత్మక "చౌడూరి సరోజినీదేవి–గోపాలరావు జీవిత సాఫల్య పురస్కారం" ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులను సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. సాహితీవేత్తలు, కవులు, రచయితలు, భాషాభిమానులు, సాహిత్య ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చౌడూరి నరసింహారావు విజ్ఞప్తి చేశారు.