అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్‌కు వినతి
విశ్వంభర, సూర్యాపేట: అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన రోడ్డును మూడు నెలలు గడిచినా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ఆగస్టు 16న జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి బోనాల సందర్భంగా 23వ వార్డు నుంచి సుమారు 500 బోనాలతో భక్తులు భారీగా పాల్గొంటారని, ప్రస్తుతం రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు, వృద్ధులు కిందపడి గాయపడినట్లు పేర్కొంటూ, పండుగకు ముందే పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ఏర్పుల కిరీటి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వల్దాస్ ఉపేందర్, వీర్జాల వేణు బలరాం, పిడమర్తి కమల్‌కాంత్, పిట్టల నరసింహ, కోడి సైదులు తదితరులు పాల్గొన్నారు.