అధికారంలో ఉన్నప్పుడు నిద్ర.. ప్రతిపక్షంలో పాదయాత్రలు: ప్రకాష్ రెడ్డిపై టిడిపి నేతల విమర్శలు
విశ్వంభర, రాప్తాడు : హంద్రీనీవా కాలువల పేరుతో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పూర్తిగా రాజకీయ స్టంట్ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప విమర్శించారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా కాలువల పనులను ఎందుకు పూర్తి చేయలేదో, రైతుల బోర్లలో నీరు అందేలా ఎందుకు చర్యలు తీసుకోలేదో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కాలువల పనులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు అదే అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో హంద్రీనీవా కాలువల మరమ్మతులు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటంతో ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రకాష్ రెడ్డి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోడు వినిపించని నాయకులు, ఇప్పుడు పాదయాత్రల పేరుతో రైతుల కన్నీళ్లపై రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో కాకుండా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఎవరి పాలనలో హంద్రీనీవా పనులు నిలిచిపోయాయో, ఎవరి హయాంలో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయో అన్నది ప్రజలే బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలు మానుకుని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ప్రకాష్ రెడ్డికి హితవు పలికారు.
రైతుల పేరుతో రాజకీయాలు కాదు రైతులకు శాశ్వత పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యం అని టిడిపి నాయకులు స్పష్టం చేశారు.