ఆదర్శ ఉపాధ్యాయుడు ఉపేందర్ రావుకు ఘన సన్మానం

విశ్వంభర, గుండాల: గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల భాషా ఉపాధ్యాయుడు కళాశికం ఉపేందర్ రావు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దేవనబోయిన అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఉపేందర్ రావు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. విద్యార్థులకు సైకిళ్లు, తాగునీటి సీసాలు, పాఠశాలకు పుస్తకాల అరలు అందించడం వంటి సేవలను గుర్తు చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు పాల్గొని ఉపేందర్ రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-great-tribute-to-the-ideal-teacher-upender-rao/article-20590

Tags: