సోలార్ ప్రాజెక్టులపై కాలవ శ్రీనివాసులు వైఖరి మార్చారని బీఎస్పీ విమర్శ
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యేకు చిందునూరు నాగరాజు డిమాండ్
Kalava Srinivasulu: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్, గాలి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గతంలో చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరికి మధ్య వ్యత్యాసం ఉందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు చిందునూరు నాగరాజు విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రాజెక్టులు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని, లేకపోతే రైతులకు 30 సంవత్సరాల లీజు మొత్తానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే రైతులు భూములు, లీజు ఆదాయం రెండింటినీ కోల్పోయే ప్రమాదం ఉందని అప్పట్లో రైతుల తరఫున ఆయన వాదించారని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న తర్వాత అదే అంశంపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మౌనం పాటిస్తున్నారని చిందునూరు నాగరాజు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఏర్పాటు చేయాలని లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా అమలు చేస్తే రైతులకు లీజు చెల్లింపులు, భూములు తిరిగి అప్పగించే అంశాలపై ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలవ శ్రీనివాసులు గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారా? లేక పూటకో మాట మార్చుతారా? అనే విషయాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని, రైతుల ప్రయోజనాల కోసం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని బీఎస్పీ తరఫున ఆయన కోరారు.