పాలచర్లలో పింఛన్ల పంపిణీ.. లబ్ధిదారులకు అందజేసిన ముత్యాలప్ప
అర్హులందరికీ సకాలంలో పింఛన్లు.. పాలచర్లలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం
Pension Distribution: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రతి నెలా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గవ్వల నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రామ్మోహన్ రెడ్డి, వడ్డే గోవిందు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.