శ్రీనిధి కార్యక్రమం పై సమీక్ష సమావేశం
విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడలో శనివారం రోజున మున్సిపల్ సమావేశ మందిరంలో శ్రీనిధి రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనిధి జోనల్ మేనేజర్ అనంత కిషోర్ మాట్లాడుతూ, శ్రీనిధి ప్రతి ఒక్క మహిళా సంఘానికి అత్యవసరానికి లోన్లు ఇస్తున్నదని దీని ద్వారా 200 మంది మహిళా డ్రైవర్లు పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకున్నట్లయితే మహిళా సంఘాలకు శ్రీనిధి రుణాలు ఇస్తామని అన్నారు. రికవరీ కల్చర్ లేకపోవడం వల్ల శ్రీనిధిలో బకాయిలు పెరుగుతున్నాయని తెలియజేశారు. అదేవిధంగా లోన్ తీసుకొని చనిపోయిన సభ్యులకు కట్టిన అమౌంట్ తిరిగి వాపసు ఇస్తామని తెలియజేశారు. రుణము సక్రమంగా చెల్లిస్తే ఆ సంఘాలకు ఇన్సెంటివ్ కూడా ఇస్తామని తెలియజేశారు. ముఖ్యంగా మార్చి 31 వరకు శ్రీనిధి బకాయిలు మొత్తము పూర్తిగా క్లియర్ చేయాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ మాట్లాడుతూ, శ్రీనిధి రుణం విషయములో వార్డ్ ఆఫీసర్లు మెప్మా రిసోర్స్ పర్సన్స్ ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా క్లియర్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ జ్ఞానేశ్వరి, డిఆర్డిఏ ఏపీడి శ్రవణ్ కుమార్ ,శ్రీనిధి రీజనల్ మేనేజర్ ,శ్రీలేఖ మెప్మా టిఎంసి బక్కయ్య సి ఓ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు, సతీష్, శ్రీనిధి మేనేజర్ సుధాకర్ అసిస్టెంట్ మేనేజర్లు మల్లేశ్వరి, ఉమా వార్డ్ ఆఫీసర్లు మరియు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.



