భూదాన్ పోచంపల్లి కి ముప్పై పడకల ఆసుపత్రికి కృషి చేస్తా. - ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల పదవి స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే.
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి:- నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ల పదవి బాధ్యత స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలనతోనే పట్టణాల్లో, గ్రామాల్లో పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు...పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఇప్పటికే 49 కోట్ల రూపాయల నిధులతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టామని..మున్సిపల్ ప్రజలకు 24 గంటల వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి త్వరలో ఈ సమస్యపై శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని..అలాగే పోచంపల్లి పట్టణానికి ముప్పై పడకల ఆసుపత్రి మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.పోచంపల్లి పట్టణంలోని అన్ని గ్రామాలకు బస్సుల కొరత లేకుండా చేయడంతో పాటు.. ఇక్కడ గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి కూడా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ నూతన చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వాయిస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



