పాఠశాలల అభివృధ్ధికి సహకరించాలి

పాఠశాలల అభివృధ్ధికి సహకరించాలి

 విశ్వంభర, పెద్దశంకరంపేట :  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు సహకరించాలని పెద్ద శంకరంపేట మండలం విద్యాధికారి వెంకటేశం అన్నారు. శనివారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు.  సమావేశంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలని అన్నారు. ప్రభుత్వం పేద పిల్లల సంక్షేమానికి నిధులు కెటాయిచండంతో పాటు ఉచిత విద్య, మధ్యాహ్నభోజనం అందిస్తుందన్నారు. విద్యార్థులను పరీక్షల సమయంలో ఇబ్బందులు పెట్టవదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్దిరాములు తదితరులున్నారు.

Tags: