హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
On
- మోత్కుపల్లి నరసింహులు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : హక్కుల సాధన కోసం మరింతగా పోరాటం చేస్తూ ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ ఆధ్వర్యంలో, పల్లెల వీరస్వామి అధ్యక్షతన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, పాత కమిటీ ఆత్మీయ వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమిష్టిగా ఉండి, రాజకీయాల్లో రాణించే దిశగా కృషి చేయాలని సూచించారు. మాజీ ఐఆర్టీఎస్ అధికారి భరత్ భూషణ్ మాట్లాడుతూ పాత కమిటీ సేవలను కొనియాడుతూ, నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. అనంతరం పాత, నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భారత్ భూషణ్, కనకయ్య, చక్రపాణి, శ్రీనివాస్, నతానియల్, దయానంద్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.



